బంగారం నాణ్యత తెలుసుకొనేందుకు యాప్‌


బంగారం వ్యాపారుల అక్రమాల వ‌ల‌న‌ కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరిగే వస్తువులకు అమలు చేస్తున్న బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నిబంధనలు బంగారు ఆభరణాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హాల్‌ మార్కు విధానాన్ని కూడ‌ అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికి స్వస్తి పలికి ఇప్పుడు హాల్‌ మార్కు యూనిఫైడ్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు (హెచ్‌యూఐడీ) విధానంతో ప్రత్యేక యాప్‌ ద్వారా నాణ్యత గుర్తించేలా చర్యలు చేప‌ట్టారు. విక్ర‌యించే బంగారు ఆభరణాలపై హెచ్‌యూఐడీ నంబరు ముద్రించాలి. దీనివల్ల బంగారం నాణ్యత, తయారీ సంస్థ వివరాలు తెలుసుకోవచ్చు.
బీఐఎస్‌ కేర్‌ గోల్డ్‌ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ యాప్‌ ద్వారా హెచ్‌యూఐడీ నంబరు స్కాన్‌ చేస్తే బంగారం నాణ్యతతో పాటు తయారీదారుని వివరాలు తెలుసుకోవచ్చు. 

Comments

Popular posts from this blog

ఇల్లు కొంటున్నారా?

ప్ర‌శ్నిద్దాం

రైలు ప్ర‌యాణంలో ఆహారం