విద్యార్థులలో వినియోగదారుల హక్కుల అవగాహన
యువ భారత్‌గా మారిపోయిన మన దేశంలో బాలలు, యువకుల శాతం 70 కి పైగానే ఉంది. కానీ యువత, బాలల సమస్యలను మనం ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం. వారి ప్రాధాన్యతలేమిటో, వారేం కోరుకుంటున్నారో మనం తెలుసుకోవటం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటూ ప్రత్యేకంగా యువత కోసం, బాలల కోసం స్కూల్ రేడియో ప్రారంభమైంది. ఇప్పటివరకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా మిగిలిపోయిన యువతకే పట్టం కడుతూ, వారే వక్తలుగా, కార్యక్రమ నిర్వాహకులుగా. వాళ్లకేం కావాలో వాళ్ళే నిర్ణయించుకునేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను స్కూల్ రేడియో మొదలు పెట్టింది. దీనిలో భాగంగా వినియోగదారుల హక్కులపై స్కూల్ రేడియో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనాలనుకొనే విద్యార్థులు స్కూల్ రేడియోను సంప్రదించవచ్చు.

Comments
Post a Comment