మారుతీ సుజుకీ కారు రీప్లేస్ చేయాలని ఉత్తర్వులు
ఇ-20 పెట్రోల్ ఇంజిన్ గ్రాండ్ విటారా కారులో సమస్యలపై ఫిర్యాదుతో మారుతీ సుజుకీకి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త కారును ఇవ్వాలంటూ రాయ్‌పుర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2023 జనవరిలో తయారైన గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జెటా+ మోడల్‌ను 2024 జూన్‌లో ఓ వినియోగదారుడు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఐదు నెలల్లోనే సమస్యలు బయటపడ్డాయి. దీంతో వినియోగదారుల కమీషన్‌ను ఆశ్రయించాడు. 45 రోజుల్లో కొత్త వాహనాన్ని ఇవ్వాలని, లేదా రూ.20.50 లక్షలు, ఆర్‌టీఓ, ఇన్సురెన్స్ ఖర్చులు కలిపి చెల్లించాలని కమిషన్ మారుతీ సుజుకీని ఆదేశించింది.

Comments
Post a Comment